Mobile Popup Ad
Mobile Popup Ad

ఆ రోజున నిజామాబాద్‌లో సీఎం రేవంత్ పర్యటన

కలం, నిజామాబాద్ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఈ నెల 6న(శుక్రవారం) నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. సీఎం అయ్యాక తొలిసారి రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటిస్తుండటంతో పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని కేశాపూర్ వద్ద భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్‌రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ సభ ద్వారా ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి జిల్లా అభివృద్ధికి సంబంధించి దిశానిర్దేశం చేసే కీలకమైన ప్రకటనలు చేయనున్నారని చెప్పారు. సుమారు 50 వేల మందితో సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వారివెంట నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ బాడ్సి శేఖర్డ్, డీసీసీ కార్యదర్శి గడ్కోల్ భాస్కర్ రెడ్డి, బీరెడ్డి సంతోష్ రెడ్డి, జావెద్ ఆక్రమ్, కేశాపూర్, బర్దిపూర్, కంజర్, ధర్మారం సర్పంచ్ లు గంగారెడ్డి. భాస్కర్, రాకేశ్ యాదవ్, వాసుబాబు, యూత్ నాయకులు నరేశ్, పెంటాజీ తదితరులు ఉన్నారు.

Read Also: మీరు పైసలిస్తే మేం సర్వే చేస్తాం.. సమ్మక్క బ్యారేజీపై చత్తీస్‌గఢ్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>