Mobile Popup Ad
Mobile Popup Ad

ఆంధ్రావర్సిటీ కల్చర్ బ్లాక్‌కు గద్దర్ పేరు పెట్టండి.. చంద్రబాబుకు రిక్వెస్ట్

కలం, వెబ్ డెస్క్:  ఆంధ్రా యూనివర్సిటీలోని ఆర్ట్స్ అండ్ కల్చర్ విభాగానికి గద్దర్ (Gaddar) పేరు పెట్టాలని ఆయన కుమార్తె వెన్నెల (Vennela) ఏపీ సీఎం చంద్రబాబును కోరారు. రాష్ట్రంలో గద్దర్ విగ్రహం ప్రతిష్ఠకు కూడా అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఆమె ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి వినతి పత్రం సమర్పించారు.

ఆంధ్రా యూనివర్సిటీ కల్చర్ బ్లాక్‌కు గద్దర్ (Gaddar) పేరు పెట్టాలన్న ప్రతిపాదనకు యూనివర్సిటీ ప్రొఫెసర్లు సైతం మద్దతు పలికారు. ఆ ప్రతిపాదనను కూడా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు వెన్నెల వెల్లడించారు. అదేవిధంగా, జనజీవనంలోకి వస్తున్న మావోయిస్టులకు ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. తన విజ్ఞప్తికి సీఎం చంద్రబాబు (Chandrababu) సానుకూలంగా స్పందించినట్లు వెన్నెల మీడియాకు వెల్లడించారు. ఏపీలోని గద్దర్ అభిమానుల కోరిక మేరకు తాను చంద్రబాబుకు విజ్ఞప్తి చేసినట్టు వెన్నెల తెలిపారు.

Read Also: రాష్ట్రంలో జంగిల్​ రాజ్యం నడుస్తోంది : జగన్

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>