కలం, వెబ్ డెస్క్: మైక్రోసాఫ్ట్ సంస్థ అధినేత బిల్‌గేట్స్(Bill Gates) ఫిబ్రవరి 18న ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు. రాజధాని అమరావతి(Amaravati)లో సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు. ఏపీ ప్రభుత్వం ఏడాది క్రితం బిల్ గేట్స్ కు చెందిన పలు సంస్థలతో కొన్ని ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ఒప్పందాలపై చర్చించేందుకే ఆయన ఏపీకి వస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బిల్‌గేట్స్ వ్యవసాయం, సాంకేతికత, ఆరోగ్య రంగాల్లో పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబుతో చర్చించనున్నారు. అమరావతిలో మరిన్ని పెట్టుబడులు పెట్టే దిశగా చర్చలు జరుగనున్నట్లు సమాచారం.


