కలం, నల్లగొండ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బుధవారం మిర్యాలగూడ (Miryalaguda)లో పర్యటించనున్నారు. నియోజకవర్గంలోని గూడూరు వద్ద నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ పాల్గొని ప్రసంగించనున్నారు. మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. అంతకుముందు రూ.200 కోట్లతో ఏర్పాటుచేయనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు శంకుస్థాపన చేయనున్నారు. షెడ్యూల్ ప్రకారం.. మధ్యాహ్నం 3.50 గంటలకు బహిరంగ సభలో రేవంత్ ప్రసంగిస్తారు.
సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్, ప్రధాన వేదిక, శంకుస్థాపనలు, బహిరంగ సభలోని ఇతర ఏర్పాట్లను పరిశీలించారు.


