కలం, డెస్క్ : విద్యుత్ రంగంలో నష్టాల్లో ఉన్న డిస్కంలను ప్రైవేటీకరించాలని ఆర్థిక సంఘం (Finance Commission) కీలక సిఫారసులు చేసింది. తీవ్రమైన నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న విద్యుత్ పంపిణీ సంస్థలను వెంటనే వదిలించుకుంటేనే బెటర్ అంటూ తెలిపింది. ఇప్పుడున్న నష్టాల నిర్వహణ కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ ను ఏర్పాటు చేయాలని సూచించింది ఆర్థిక సంఘం. ఆర్థిక సంఘం మరో కీలక సూచన కూడా చేసింది. గత మూడు నుంచి నాలుగేళ్లుగా నష్టాల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలను కూడా వదిలించుకోవాల్సిందే అని తెలిపింది.
డిస్కంలను కొత్తగా టేకోవర్ చేసే కంపెనీలు నష్టాల్లో పడకుండా చర్యలు కూడా తీసుకోవాలని తెలిపింది ఆర్థిక సంఘం. ఆర్థిక సంఘం (Finance Commission) చేసిన సిఫారసులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించడంతో పాటు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టింది. ఎన్ పీవీలకు మళ్లించిన మొత్తాల చెల్లింపుల కోసం రుణాల రీ షెడ్యూల్ ద్వారా ప్రయత్నించాలని ఆర్థిక సంఘం సూచించింది. రీపేమెంట్ కోసం 16వ ఆర్థిక సంఘం ద్వారా సమకూరే ప్రత్యేక నిధులను ఉపయోగించుకోవాలని తెలిపింది. ఇక్కడే ఆర్థిక సంఘం ఓ కీలక కండీషన్ పెట్టింది.
డిస్కంలను ప్రైవేటీకరించిన తర్వాతే ఆ నిధులను వాడుకోవచ్చని తెలిపింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ డిస్కంలు రూ.25వేల కోట్ల నష్టాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. గత మూడు, నాలుగేళ్లుగా నష్టాల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ యూనిట్లను వెంటనే వదిలించుకోవాలని ఆర్థిక సంఘం సూచిస్తోంది. ప్రస్తుతం నష్టాల్లో ఉన్న డిస్కంలు రాష్ట్రాల పరిధిలో 308 వరకు ఉన్నట్లు ఫైనాన్స్ కమిషన్ గుర్తించింది. పనితీరు సరిగ్గా లేని డిస్కంలను గుర్తించి పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని ఆర్థిక సంఘం తెలిపింది. నష్టాల్లో ఉన్న డిస్కంలు కేంద్ర ప్రభుత్వ పరిధిలోనివి అయితే.. యూనియన్ కేబినెట్, రాష్ట్రం పరిధిలో ఉంటే స్థానిక కేబినెట్ దీనిపై నిర్ణయం తీసుకోవాలని ఆర్థిక సంఘం తెలిపింది.


