పోలీసులకు సవాల్ విసురుతూ, తెలుగు సినిమాలను పైరసీ చేస్తున్న ఐబొమ్మ(iBOMMA) నిర్వాహకుడు ఇమ్మడి రవి(Immadi Ravi)ని సైబర్‌క్రైమ్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఫ్రాన్స్ నుంచి శుక్రవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్న రవిని, కూకట్‌పల్లి ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. రవి కొంతకాలంగా కరేబియన్ దీవుల్లో ఉంటూ అక్కడి నుంచే ఐబొమ్మ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నట్టు సమాచారం.
అరెస్ట్ అనంతరం రవి ఆన్‌లైన్ లావాదేవీలను సైతం ఆపేసినట్టు సమాచారం. అతడి అకౌంట్ల ఉన్న రూ. 3 కోట్ల నిధులను ఫ్రీజ్ చేశారు. పైరసీ ద్వారా వచ్చిన ఆదాయాన్ని డిజిటల్ మార్గాల్లో తరలిస్తున్నాడని అధికారులు అనుమానిస్తున్నారు. సమాచార సేకరణ కోసం అతని ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
తెలుగు ఫిల్మ్ యాంటీ పైరసీ టీమ్ ఐబొమ్మకు వ్యతిరేకంగా గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఐబొమ్మ(iBOMMA) నిర్వాహకులు మాత్రం తమపై వచ్చిన ఆరోపణలను పట్టించుకోకుండా నిత్యం పోలీసులకు సవాల్ విసిరారు. దీంతో సైబర్ క్రైమ్ అధికారులు ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.
ఇప్పటికే ఐబొమ్మ కార్యకలాపాలకు సహకరిస్తున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో బిహార్, ఉత్తర్ ప్రదేశ్‌లలో ఐబొమ్మ కోసం పనిచేస్తున్న ఏజెంట్లను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా విస్తరించిన ఈ నెట్ వర్క్ వెనుక ఉన్న ముఖ్య వ్యక్తులను గుర్తించేందుకు దర్యాప్తును మరింత లోతుగా కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Read Also: బీహార్‌లో విజయ రహస్యం చెప్పిన ప్రధాని మోదీ
Follow Us on: Youtube

