Mobile Popup Ad
Mobile Popup Ad

సినీ నటుడు మోహన్ బాబు, విష్ణుపై కిడ్నాప్ కేసు

కలం, డెస్క్ : సినీ నటుడు మంచు మోహన్ బాబు (Mohan Babu), హీరో మంచు విష్ణుపై (Vishnu) కిడ్నాప్ కేసు నమోదైంది. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఎస్ ఎఫ్‌ ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అక్బర్, ఎస్ ఎఫ్ ఐ ఎస్వీ యూనివర్సిటీ నాయకుడు వినోద్ తో పాటు మరికొందరు విద్యార్థులు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించడానికి వెళ్లారు. అయితే వీరి మీద మోహన్ బాబు అనుచరులు దాడి చేసి కిడ్నాప్ చేశారంటూ ఎస్పీ సుబ్బరాయుడుకు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మురళి ఫిర్యాదు చేశారు. దీంతో మోహన్ బాబు, విష్ణులపై కేసు నమోదు చేశారు పోలీసులు. విద్యార్థులపై దాడి చేసి, కిడ్నాప్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు ఎస్పీ సుబ్బరాయుడు.

ఈ విషయంపై ఇప్పటి వరకు మోహన్ బాబు గానీ, విష్ణు గానీ (Mohan Babu – Vishnu) స్పందించలేదు. మంచు మనోజ్ అప్పట్లో మోహన్ బాబు యూనివర్సిటీలో పెద్ద ఎత్తున విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఆరోపించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఎంయూపై ఏదో ఒక వివాదం తెరమీదకు వస్తూనే ఉంది. మరి దీనిపై మోహన్ బాబు ఫ్యామిలీ ఏమైనా స్పందిస్తుందా లేదా అనేది చూడాలి.

Read Also: ధనుష్‌తో మరోసారి సాయిపల్లవి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>