epaper
Wednesday, February 18, 2026
epaper

ఓటీటీలోకి చిరు MSVPG మూవీ.. ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే!

కలం, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన మన శంకర వర ప్రసాద్ గారు మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోటి రూపాయల కలెక్షన్స్ సాధించింది. చిరంజీవి కెరీర్‌లోనే భారీ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రికార్డులను కొల్లగొట్టిన ఈ మూవీ త్వరలో ఓటీటీ (OTT)లోకి రానుంది.

ఈ సినిమా ఏడు భాషల్లో రిలీజ్ కాబోతున్నట్టు తెలుస్తోంది. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, మరాఠీతోపాటు మరికొన్ని భాషల్లో ప్రేక్షకుల ముందుకురాబోతోంది. టాలీవుడ్ వర్గాల ప్రకారం.. ఫిబ్రవరి 11 ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్టు తెలుస్తోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకున్న ఈ మూవీలో నయనతార ముఖ్య పాత్రలో కనిపించగా, వెంకటేశ్ గెస్ట్ రోల్‌లో అలరించాడు. భీమ్స్ మ్యూజిక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టిన ఈ మూవీకి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో వేచి చూడాల్సిందే.

 Read Also: కల్కి 2 : దీపికా స్థానంలో సాయిపల్లవి ?

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>