epaper
Wednesday, February 18, 2026
epaper

మాజీ ఎమ్మెల్యే రామ్ రెడ్డి మృతి బాధాకరం : కవిత

కలం, డెస్క్ : మంథని మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రామ్ రెడ్డి (Chandupatla Ram Reddy) మృతి బాధాకరం అన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha). ఈ మేరకు ఆమె ఎక్స్ లో పోస్టు పెట్టారు. మంథని ఎమ్మెల్యేగా, ముత్తారం ఎంపీపీగా, ఖమ్మంపల్లి సర్పంచ్ గా సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం రామ్ రెడ్డికి ఉందని.. ఆయన ప్రజలకు ఎంతో సేవలందించినట్టు రాసుకొచ్చారు కవిత . తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించారని.. అలాంటి వ్యక్తి మరణం రాజకీయాల్లో తీరని లోటు అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కవిత కోరారు. రామ్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు రాసుకొచ్చారు.

Read Also: ట్యాపింగ్ అయిన ఫోన్‌లన్నింటికీ అప్రూవల్ ఉందా?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>