కలం, వెబ్‌డెస్క్: ఇండియాపై విధించిన టారిఫ్స్‌ను అమెరికా కొంతమేర తగ్గించింది (US Tariff Cut). ఈ క్రమంలో దీని వల్ల మన దేశానికి ఏంటి లాభం? ధరలు ఏవి తగ్గుతాయి? ఏవి పెరుగుతాయి? అనేవి అందరిలోనూ మెదులుతున్న ప్రశ్నలు. వీటికి సమాధానాలేంటంటే.. మొదటగా మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతులు పెరుగుతాయి. మన ఉత్పత్తులకు మంచి డిమాండ్ దక్కుతుంది. ముఖ్యంగా టెక్స్ టైల్స్, ఆభరణాలు, లెదర్ వస్తువులు, కెమికల్స్, ఆటోమొబైల్ విడిభాగాల తయారీకి బెనిఫిట్స్ లభిస్తాయి. రొయ్యలు వంటి సముద్ర ఉత్పత్తులకూ యూఎస్‌లో గిరాకీ ఉంటుంది. దాదాపు రూ.4 లక్షల కోట్ల విలువైన భారతీయ వస్తువులకు భారీ పన్ను భారం తప్పనుంది.
టెక్స్టైల్స్:
టెక్స్ టైల్స్‌పై ప్రస్తుతం 25 శాతంగా ఉన్న అమెరికా టారిఫ్ 18 శాతానికి దిగిరానుంది (US Tariff Cut). 2024లో అమెరికాకు ఇండియా రూ.85 వేల కోట్ల విలువైన దుస్తులను ఎగుమతి చేసింది. ఆ తర్వాత టారిఫ్స్ ప్రభావం పడినా.. ప్రస్తుతం 7 శాతం తగ్గడంతో ఇక్కడ పనిచేసే చేనేత కార్మికులకు ఉపాధి పెరుగుతుంది.
రొయ్యలు :
రొయ్యలపై ఉన్న 10 శాతం అమెరికా టారిఫ్ 6 శాతానికి తగ్గే అవకాశం ఉంది. అమెరికాకు ఏటా ఇండియా నుంచి రెండున్నర లక్షల టన్నుల రొయ్యలు ఎక్స్‌పోర్టు అవుతుంటాయి. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లే రొయ్యల వాటానే 60 శాతం. ఇక్కడ లభించే వనామీ రొయ్యలను అమెరికా జనం బాగా ఇష్టపడుతుంటారు. అందువల్ల, ఇదే ఎక్కువగా ఎగుమతి అవుతుంది.
ఆభరణాలు, లెదర్ పరిశ్రమలు :
ఆభరణాలపై ఉన్న 15 శాతం యూఎస్ సుంకం 10 శాతానికి తగ్గొచ్చు. లెదర్ వస్తువులు, ఫార్మా వంటి వాటిపై కూడా సుంకాలు తగ్గే అవకాశం ఉండటంతో ఆయా రంగాలకు లాభం చేకూరుతుంది.
Read Also: టారిఫ్ కట్ ఎఫెక్ట్.. పెట్రోల్ రేట్లు పెరుగుతాయా?
Follow Us On: Sharechat


