కలం, డెస్క్ : తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కుట్ర దారులను బయటపెట్టేందుకే విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్టు సీఎం చంద్రబాబు (Chandrababu) చెప్పారు. తిరుమల నెయ్యిని తాము రాజకీయ కోణంలో చూడట్లేదని సీఎం చంద్రబాబు వివరించారు. కేబినెట్ భేటీకి ముందు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేష్, సత్య ప్రసాద్ లతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు నాయుడు. తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని.. అందుకే నిజానిజాలు బయటపెట్టాలని అనుకుంటున్నట్టు వివరించారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మాట్లాడుతూ.. వైసీపీ చేసింది మహాపచారం అన్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేయడం అంటే తీవ్రమైన నేరంగానే తమ ప్రభుత్వం పరిగణిస్తోందని చెప్పారు. దోషులను ఎవరినీ వదిలేది లేదన్నారు. విచారణ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా అసలు సూత్రదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.

Read Also: కల్తీ నెయ్యి కేసుపై విచారణ కమిటీ : మంత్రి పయ్యావుల
Follow Us On: Youtube


