Mobile Popup Ad
Mobile Popup Ad

కల్తీ నెయ్యి కేసుపై విచారణ కమిటీ : మంత్రి పయ్యావుల

కలం, డెస్క్ : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కల్తీ నెయ్యి కేసుపై (Adulterated Ghee Case) విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ విషయాలను మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) మీడియాకు వివరించారు. సిట్ ఛార్జ్ షీట్ లో పేర్లు లేకున్నా.. ఇందులో ఇన్వాల్వ్ అయిన వారందరినీ నేరస్థులుగానే పరిగణిస్తామని చెప్పారు. విచారణ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. 2022లోనే ఎన్డీబీవీ రిపోర్టు వచ్చినా దాన్ని తొక్కిపెట్టారని తెలిపారు మంత్రి పయ్యావుల కేశవ్.

‘సరళీకృతం చేయడంలో భాగంగానే 3 రూల్స్ ను మార్చేశారు. అప్పటి నుంచి పాలు లేకపోయినా నెయ్యిని కెమికల్ తో తయారు చేస్తూ సరఫరా చేశారు. బోలేబాబా డెయిరీని తెచ్చింది వైసీపీ నేతలే. వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్న పెద్ద ఎత్తున ముడుపులు తీసుకుని బోలేబాబు డెయిరీని ఎంకరేజ్ చేశారు. అప్పటి నుంచి ఎన్నో రిపోర్టులు వచ్చినా బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎన్డీబీవీ రిపోర్టు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశీలించాం. సీఎం చంద్రబాబు (Chandrababu) ఆ రిపోర్టు ఆధారంగానే జంతువుల కొవ్వు కలిసి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. అందుకే సిట్ వేస్తే.. స్కామ్ బయటపడింది. సుప్రీంకోర్టు వేసిన సిట్ తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పింది. ధర్మారెడ్డి, బాలాజీ, సింఘాల్ పై చర్యలకు సిఫార్సు చేసింది. తప్పు జరుగుతోందని తెలిసినా వైవీ సుబ్బారెడ్డి హయాంలోని టీటీడీ బోర్డు, కొందరు అధికారులు సైలెంట్ గా ఉన్నారు. వాళ్లు ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ కాకపోయినా.. తప్పు తెలుసు కాబట్టి వారందరూ ఇందులో భాగమే. వారందరినీ నేరస్తులుగానే పరిగణిస్తాం’ అంటూ తెలిపారు మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav).

Read Also: ముగిసిన అరవ శ్రీధర్ విచారణ

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>