కలం, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఎప్పుడూ నీడలా వెంట ఉండే మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ ఎంక్వయిరీ రోజు ఎందుకు కనిపించలేదు? కష్టకాలంలో ఎప్పుడూ తోడుగా ఉండే సంతోష్ రాకపోవడంలోని మర్మమేంటి? KCRతో పాటు ఎర్రవల్లి ఫామ్ హౌజ్ నుంచి నందినగర్ నివాసానికి ఎందుకు రాలేదు?.. ఫామ్ హౌజ్‌లోనే ఎందుకు ఉండిపోయారు?.. ఇలాంటి సందేహాలు బీఆర్ఎస్ నేతల్లో వినిపిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో కేసీఆర్‌ను సిట్ (SIT) పోలీసులు ఆదివారం మధ్యాహ్నం నందినగర్ నివాసంలో ఎంక్వయిరీ (KCR SIT Inquiry) చేస్తున్నప్పుడు కేటీఆర్, హరీశ్‌రావు మాత్రమే కనిపించినా సంతోష్ లేకపోవడంపై శ్రేణులు, రాష్ట్రస్థాయి నేతల్లో చర్చనీయాంశంగా మారింది. ఎక్కడున్నారు? ఎందుకు రాలేదు? కారణాలేంటి? ఇవీ వారి మధ్య జరిగిన చర్చలు.
సంతోష్ ఎంక్వయిరీ తర్వాతే కేసీఆర్‌కు నోటీసులు :
ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలుత హరీశ్‌రావును, ఆ తర్వాత కేటీఆర్‌ను ఎంక్వయిరీకి పిలిచారు. ఆ తర్వాత కవిత లేదా ఆమె భర్తకు నోటీసులు వచ్చే రావచ్చనే ప్రచారం జరిగింది. అనూహ్యంగా సంతోష్‌కు నోటీసులు వెళ్ళాయి. ఆ ప్రకారమే ఆయన ఎంక్వయిరీకి హాజరయ్యారు. దీంతో ఇకపైన నోటీసులు కవితకా?.. లేక కేసీఆర్‌కా?.. అనే ఊహాగానాలు వెలువడ్డాయి. చిట్టచివరకు కేసీఆర్‌కు ఇస్తారని, ఈ లోపు మిగిలినవారిని ఎంక్వయిరీకి పిలుస్తారన్న లాజిక్‌తో రకరకాల మాటలు వినిపించాయి. కానీ సంతోష్ విచారణ 27న ముగియడంతో 29న కేసీఆర్‌కు నోటీసులు జారీ అయ్యాయి. సంతోష్ ఎంక్వయిరీ అయిపోయిన రెండు రోజుల్లోనే కేసీఆర్‌కు నోటీసులు ఇష్యూ కావడం సరికొత్త చర్చకు దారితీసింది. ఏదో ఒక రోజు నోటీసులు తప్పవనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో ఉన్నా సంతోష్ ఎంక్వయిరీ జరిగిన వెంటనే వస్తాయని ఊహించుకోలేకపోయారు.
వద్దన్నారా? వద్దామనుకోలేదా?
కేసీఆర్‌ను సిట్ ఎంక్వయిరీ చేస్తున్న సమయంలో నందినగర్ నివాసంలో కేవలం ముగ్గురు ఉండడానికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. కేటీఆర్, హరీశ్‌రావు, సంతోష్‌లు మాత్రమే ఉండొచ్చని, ఇంకెవ్వరూ ఉండడానికి అనుమతించబోమని తేల్చి చెప్పారు. ఎంక్వయిరీ రెండో అంతస్తులో జరుగుతూ ఉంటే కేటీఆర్, హరీశ్‌రావు ఆ భవనంలోనే మరో చోట ఉండిపోయారు. కానీ సంతోష్ మాత్రం ఆ రోజు నందినగర్ నివాసానికి రాలేదు. ఎందుకు రాలేదనే చర్చ జోరుగానే సాగింది. కేసీఆర్ రావద్దని చెప్పారా?.. లేక సంతోషే రావద్దని డిసైడ్ అయిపోయారా? ఇలాంటి అనుమానాలు వ్యక్తమయ్యాయి. కేసీఆర్ వెంట ఎప్పుడూ కనిపించే సంతోష్ ఆ రోజు రాకపోవడంలోని ఆంతర్యమేంటన్నది వారి సందేహం. ఫామ్‌హౌజ్‌లోనే ఉండిపోవడానికి కారణమేంటనేది కూడా ఆ చర్చల్లో ఒక అంశం. ఏ కారణం లేకుండా సంతోష్ ఆబ్సెంట్ కారు అనేది శ్రేణుల ప్రగాఢ విశ్వాసం. కేసీఆర్ ఎంక్వయిరీ (KCR SIT Inquiry) పూర్తయ్యి రెండు రోజులవుతున్నా శ్రేణుల్లో సందేహాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.
ఫోన్ ట్యాపింగ్ కేసు: మరో ప్రత్యేక కథనం ఈరోజు రాత్రి 8 గంటలకు Kalamdaily.com వెబ్సైట్ లో
Read Also: ఫోన్ ట్యాపింగ్‌లో ట్విస్ట్.. ఆ మిస్సింగ్ లింక్స్ పై సస్పెన్స్
Follow Us On: Instagram


