కలం, సినిమా : టాలీవుడ్ హిట్ మిషన్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) మరోసారి సంక్రాంతి బరిలోకి దిగుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా “మన శంకర వరప్రసాద్ గారు” సినిమాతో గత సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి.. ఈ సారి సంక్రాంతికి సాలిడ్ కాంబినేషన్‌తో బరిలోకి దిగుతున్నారు. విక్టరీ వెంకటేశ్(Venkatesh), కళ్యాణ్ రామ్ (Kalyan Ram) కాంబినేషన్‌లో దర్శకుడు అనిల్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చారు. ‘జనవరి 12 విడుదల’(January 12 Vidudala) అనే టైటిల్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. “సంక్రాంతికి వచ్చే మన సినిమా పేరు.. జనవరి 12 విడుదల” అంటూ అనిల్ రావిపూడి పోస్టు చేశారు. 2027 జనవరి 12న సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే ట్యాగ్ లైన్‌తో విడుదల తేదీని ప్రకటించడంతో ఈ పోస్టు అభిమానులను ఆకట్టుకుంటోంది.

