కలం, వెబ్ డెస్క్ : పార్లమెంట్ (Parliament) లో ఎనిమిది మంది విపక్ష ఎంపీలు సస్పెన్షన్ కు గురయ్యారు. స్పీకర్ స్థానంలో ఉన్న తెన్నేటీ కృష్ణ ప్రసాద్ పై పేపర్లు విసిరేశారన్న కారణంగా ఎంపీలపై వేటు వేశారు. లోక్‌సభలో (Lok Sabha) బడ్జెట్ సమావేశాల సెషన్ పూర్తయ్యేంత వరకు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సస్పెన్షన్ గురయ్యారు. ఆయనతో సహా మరో ఏడుగురు విపక్ష ఎంపీలు హిబి ఈడెన్, అమరీందర్ సింగ్ రాజా వారింగ్, మాణిక్కం ఠాగూర్, గుర్జీత్ సింగ్, యాదవ్ రావ్ పదోల్, వెంకటేషన్, డీన్ కురైకోస్ లను సైతం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. ఈ మొత్తం సెషన్ వారిపై సస్పెన్షన్ అమల్లో ఉంటుంది.
Read Also: ట్రేడ్ డీల్‌తో రైతుల కష్టం అమెరికాకు తాకట్టు : రాహుల్
Follow Us On: X(Twitter)


