epaper
Wednesday, February 18, 2026
epaper

ముగిసిన అరవ శ్రీధర్ విచారణ

కలం, వెబ్ డెస్క్: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న రైల్వే కోడురు (Railway Kodur) జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ (Arava Sridhar) విచారణ ముగిసింది. ఇటీవల అరవ శ్రీధర్ మీద తీవ్ర ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. తనను అరవ శ్రీధర్ లైంగికంగా వేధించాడని ఓ మహిళా ఉద్యోగి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఘటనకు సంబంధించిన నిజానిజాలు తేల్చేందుకు జనసేన కమిటీ మంగళవారం రైల్వే కోడూరుకు చేరుకొని విచారణ చేపట్టింది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ను వివిధ కోణాల్లో ప్రశ్నించినట్టు సమాచారం. సదరు యువతి విడుదల చేసిన వీడియోల ఆధారంగా విచారణ చేపట్టింది.

వీడియోలో ఉన్న అంశాలు నిజమేనా? అని కమిటీ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. మరోవైపు బాధితురాలు ఇప్పటికే ఎన్‌జీఆర్‌సీని ఆశ్రయించింది. విచారణ అనంతరం మీడియా ముందుకొచ్చిన అరవ శ్రీధర్ (Arava Sridhar) మాట్లాడుతూ.. కమిటీ నివేదిక ఇచ్చిన అనంతరం తాను అన్ని వివరాలు బయటపెడతానని చెప్పారు.

Read Also: కల్తీ నెయ్యి కేసుపై విచారణ కమిటీ : మంత్రి పయ్యావుల

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>