epaper
Wednesday, February 18, 2026
epaper

పాక్‌ను ఐసీసీ ఏం చేయలేదు

కలం, వెబ్ డెస్క్:  భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేసిన విషయంలో పాకిస్థాన్ టీమ్‌ను ఐసీసీ ఏం చేయలదని ఐసీసీ మాజీ ఛైర్‌పర్సన్ ఎహ్సాన్ మణి (Ehsan Mani) వ్యాఖ్యానించారు. భారత్‌తో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌ను బహిష్కరించాలన్న పాకిస్థాన్ నిర్ణయం తాజాగా పెద్ద చర్చకు దారి తీసింది. ఈ వ్యవహారంపై మాజీ ఐసీసీ చైర్మన్ ఎహ్సాన్ మణి స్పందించారు. ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ ఫిబ్రవరి 1న పాకిస్థాన్ ప్రభుత్వం భారత్‌తో ఆడబోమని ప్రకటించింది. టీమ్ టోర్నీలో పాల్గొంటుంది కానీ భారత్‌తో మైదానంలోకి దిగదని స్పష్టం చేసింది. ఇది ఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా మారింది. ఐసీసీ తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. అయితే మణి మాత్రం ఇది ప్రభుత్వ ఆదేశం కావడంతో ఐసీసీ శిక్షలు విధించలేదని అన్నారు.

భారత్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్‌కు వెళ్లనని చెప్పిన ఉదాహరణను ఆయన (Ehsan Mani) గుర్తు చేశారు. ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని వ్యాఖ్యానించారు. ఐసీసీ ఈ సమస్యను సరిగా ఎదుర్కోలేదని కూడా విమర్శించారు. ప్రభుత్వ జోక్యం పెరగడానికి ఇది అవకాశం కల్పిస్తుందని హెచ్చరించారు. PCB చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ మంత్రి కావడంతో క్రికెట్, పాలన మధ్య గీత మసకబారుతోందని సూచించారు.

ఐసీసీ మాత్రం పాకిస్థాన్ నిర్ణయం టోర్నీ సమగ్రతను దెబ్బతీస్తుందని తెలిపింది. నిర్ణయాన్ని పునరాలోచించాలని కోరింది. భారత్-పాక్ మ్యాచ్ అత్యంత ఆదాయమిచ్చే పోరు. వాక్‌ఓవర్ జరిగితే భారత్‌కు పాయింట్లు వస్తాయి. బ్రాడ్‌కాస్టర్లకు భారీ నష్టం వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా పాకిస్థాన్ తన మిగతా మ్యాచ్‌లు కొలంబోలో ఆడనుంది. ఫిబ్రవరి 7న నెదర్లాండ్స్‌తో మ్యాచ్ ఉంది. ఈ వ్యవహారం ప్రపంచ క్రికెట్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది.

Read Also: ఐఎస్ఎల్ కోసం ప్లేయర్ల త్యాగం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>