epaper
Wednesday, February 18, 2026
epaper

యాదాద్రి జిల్లాలో మరోసారి పులి అలజడి

కలం, నల్లగొండ బ్యూరో: యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లా పై మళ్లీ పులి పంజా విసిరింది. జిల్లాలో గత పది రోజులుగా 10కి పైగా లేగ దూడలను చంపి తినేసింది. దీంతో యాదాద్రి జిల్లాలోని రైతాంగానికి కంటిమీద కుంకులేకుండా పోయింది. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట (మం) బసంత పూర్ గ్రామంలోని ఓ వ్యవసాయ బావి వద్ద లేగదూడపై పులి దాడి చేసి చంపితిన్నది. సదరు రైతు రోజువారీలా భావి వద్ద లేగదూడను కట్టేసి ఇంటికి వెళ్లిపోయాడు. మంగళవారం ఉదయం వచ్చి చూసేసరికి లేక దూడను పులి దాడి చేసి చంపేసింది.

పులి పాదముద్రలు గుర్తింపు

యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhuvanagiri) బసంతపురం గ్రామంలోని కట్కూరి రమేష్ బావి దగ్గర పులి లేగదూడ మెడలు కొరికేసి రక్తం తాగి వెళ్లిపోయింది. అయితే సమీప ప్రాంతంలోని పొలంగట్లపై పులి పాదముద్రలను స్థానిక రైతులు గుర్తించారు. గతంలోనూ ఇదే తరహాలో లేక దూడలపై దాడి చేసి చంపేసింది. ఇదిలా ఉంటే సోమవారం సాయంత్రం సిద్దిపేట జిల్లాలోని జగదేవ్పూర్ మండలంలో పులి (Tiger) స్థానిక రైతుల కంటపడింది. అయితే అక్కడ కనిపించిన పులి ఇది వేరువేరా ఒక్కటేనా అన్న సందేహం నెలకొంది. మరోవైపు వరుస పులి దాడులతో స్థానికులు, రైతులు హడలిపోతున్నారు. దాదాపు పది రోజులుగా పులి జాడ కోసం అటవీ శాఖ అధికారుల ప్రయత్నాలు విఫలమవుతూనే ఉన్నాయి.

Read Also: విద్యార్థినిపై ఉపాధ్యాయుడి లైంగిక దాడి

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>