కలం, వెబ్ డెస్క్ : హుస్సేన్‌సాగర్ (Hussain Sagar)లో దూకి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ విజయలక్ష్మి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. మేడ్చల్ (Medchal) జిల్లా కండ్లకోయకు చెందిన విజయలక్ష్మికి తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. తల్లి సరస్వతికి మతిస్థిమితం సరిగా ఉండదు. ప్రస్తుతం కూకట్‌పల్లి పరిధి మైత్రినగర్‌లో విజయలక్ష్మి తల్లితో కలిసి నివశిస్తుంది. ఐటీ సంస్థలో పనిచేస్తూనే విజయలక్ష్మి.. తన తల్లిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది.
ఉద్యోగం చేస్తున్న విజయలక్ష్మికి ఇటీవల పలు వివాహ సంబంధాలు వచ్చాయి. అయితే పెళ్లి అయ్యాక కూడా తన తల్లీ తనతోనే ఉంటుంది.. అనే షరతు పెట్టడంతో ఏ సంబంధం కుదరడం లేదు. దీనితో తీవ్ర మనస్థాపానికి లోనైన విజయలక్ష్మి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంది. సూసైడ్ ఎలా చేసుకోవాలని ల్యాప్‌టాప్‌లో సెర్చ్ చేసింది. శనివారం సాయంత్రం ర్యాపిడో బైక్ మీద ట్యాంక్‌బండ్‌కు వెళ్లి హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంది. సాగర్‌లో లభ్యమైన మృతదేహాన్ని పోలీసులు విజయలక్ష్మిదిగా గుర్తించారు.


