epaper
Wednesday, February 18, 2026
epaper

ధనుష్‌తో మరోసారి సాయిపల్లవి

కలం, సినిమా : తమిళ్ స్టార్ హీరో ధనుష్(Dhanush), అమరన్ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియసామి (Rajkumar Periasamy) కాంబినేషన్‌లో ఓ  భారీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది ధనుష్ కెరీర్‌లో 55వ సినిమాగా తెరకెక్కుతుంది. వండర్‌బార్ ఫిల్మ్స్ బ్యానర్ పై ధనుష్ ఈ సినిమాను స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ధనుష్ సరసన శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా నటిస్తుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా సాయి  పల్లవి (Sai Pallavi) నటిస్తుందంటూ  మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

గతంలో ధనుష్, సాయిపల్లవి మారి 2 సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. వారిద్దరి పెయిర్‌ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. తాజాగా మరోసారి ఇద్దరు కలిసి నటిస్తుండటంతో  ధనుష్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాకు సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఆమరన్ సినిమాకు ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. దీనితో ధనుష్ సినిమాకు సాయి అభ్యంకర్  ఎలాంటి ట్యూన్స్ తో మ్యాజిక్  చేస్తాడో చూడాలి. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ త్వరలో రానున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>