భారత్-అమెరికా ట్రేడ్ డీల్‌పై కేంద్ర మంత్రుల హర్షం

కలం, వెబ్ డెస్క్: భారత్‌–అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య (ట్రేడ్‌) ఒప్పందాలను (India US Trade Deal) కేంద్ర మంత్రులు స్వాగతించారు. ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్య జరిగిన చర్చల అనంతరం కుదిరిన ఒప్పందాలు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని వారు అభిప్రాయపడ్డారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ ఈ ఒప్పందాలు భారత్‌–అమెరికా భాగస్వామ్యాన్ని కొత్త దశకు తీసుకెళ్తాయని వ్యాఖ్యానించారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక రంగాల్లో సహకారం మరింత విస్తరిస్తుందని ఆయన తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చోటుచేసుకుంటున్న మార్పుల మధ్య ఈ ఒప్పందాలు భారత్‌కు ప్రయోజనకరంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మాట్లాడుతూ, ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్‌ అంతర్జాతీయ వేదికపై తన స్థాయిని మరింత పెంచుకుంటోందని అన్నారు. భారత్‌ ప్రయోజనాలను కాపాడుతూ, ప్రపంచ శక్తులతో సమాన భాగస్వామ్యంతో ముందుకెళ్లడమే ఈ ఒప్పందాల (India US Trade Deal) లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అలాగే కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్‌, పీయూష్‌ గోయల్‌ కూడా ఈ ఒప్పందాలను స్వాగతించారు. భారత్‌ ఎగుమతులు, పరిశ్రమల అభివృద్ధికి ఇవి దోహదపడతాయని వారు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా తయారీ రంగం, మౌలిక సదుపాయాలు, కొత్త పెట్టుబడులకు ఈ ఒప్పందాలు అనుకూలంగా మారుతాయని తెలిపారు.

అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ కూడా స్పందిస్తూ, భారత్‌–అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలపడటంతో దేశ ఆర్థికాభివృద్ధికి కొత్త అవకాశాలు తెరుచుకుంటాయని అన్నారు. ప్రపంచ వాణిజ్యంలో భారత్‌ కీలక పాత్ర పోషించే దిశగా ఈ ఒప్పందాలు ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. మొత్తంగా, మోదీ–ట్రంప్‌ మధ్య కుదిరిన ఈ ట్రేడ్‌ డీల్‌ రెండు దేశాల మధ్య వ్యూహాత్మక, ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే కీలక అడుగుగా కేంద్ర నాయకత్వం అభివర్ణించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>