కలం, డెస్క్ : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) జనసేన నాయకులపై సీరియస్ అయ్యారు. పార్టీ జనరల్ బాడీ మీటింగ్ లో జనసేన అధినేత పవన్ ఆగ్రహంతో మాట్లాడారు. వైసీపీ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఎందుకు తిప్పి కొట్టట్లేదని మండిపడ్డారు పవన్ కల్యాణ్. లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో ఇంత జరుగుతుంటే ఒక్కరు కూడా మాట్లాడట్లేదని.. అన్నింటికీ తానొక్కడినే మాట్లాడితే ఇక మీరెందుకు అంటూ సీరియస్ అయ్యారు పవన్. ఎవరెవరు ఏమేం చేస్తున్నారో అన్నీ తనకు తెలుసని.. వాటన్నింటిపై త్వరలోనే యాక్షన్ తీసుకుంటానని తెలిపారు. ఆగ్రహంతో మీటింగ్ నుంచి పవన్ వెళ్లిపోయారు. పార్టీ నేతల తీరుపై రిపోర్టు ఇవ్వాలని మంత్రి నాదెండ్ల మనోహర్ కు చెప్పి వెళ్లిపోయారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
Read Also: పాక్‌ను బెంబేలెత్తిస్తున్న బలూచ్ ఆత్మాహుతి దళం మహిళలు
Follow Us On : WhatsApp


