epaper
Monday, February 2, 2026
spot_img
epaper

పాక్​ను బెంబేలెత్తిస్తున్న బలూచ్​ ఆత్మాహుతి దళం మహిళలు

కలం, వెబ్​డెస్క్​: పాకిస్థాన్​లోని బలూచిస్థాన్ ​(Balochistan)లో భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఈ ఘర్షణల్లో రెండు వైపులా భారీ స్థాయిలో ప్రాణాలు బలవుతున్నాయి. అనధికారిక లెక్కల ప్రకారం ఇప్పటికే దాదాపు 250 మందికి పైగా చనిపోయారు. ఇందులో పాక్​ సైనికులు, బీఎల్​ఏ సభ్యులతోపాటు సాధారణ ప్రజలూ ఉన్నారు. మహిళలు, చిన్నారులు కూడా ఎక్కువ సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు.

బలూచిస్థాన్​ లిబరేషన్​ ఆర్మీ (బీఎల్​ఏ) శనివారం ఒకేసారి బలూచిస్థాన్​ ప్రావిన్స్​లోని 12 నగరాలు/పట్టణాల్లో దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఇందులో ఆత్మాహుతి దళం సైతం పాల్గొన్నట్లు బీఎల్​ఏ ప్రకటించింది. ఈ క్రమంలో దీనికి సంబంధించిన వీడియోను సోమవారం విడుదల చేసింది. ఇందులో బలూచ్​ ఆత్మాహుతి దళంలోని ఓ మహిళ పాక్​ ఆర్మీపై కాల్పులు జరపడం చూడొచ్చు. ఆమె కాల్పులు జరుపుతుండగా మరో మహిళ వీడియో తీసినట్లు తెలుస్తోంది. అయితే, పాక్​ ఆర్మీ ఎదురు కాల్పుల్లో మహిళా యోధురాలు చివరికి మరణించింది. ఇందులో చనిపోయిన ఆమె పేరు హవా బలోచ్​ అని, ఆమె బలూచిస్థాన్​ విముక్తి కోసం అమరురాలైందని బీఎల్​ఏ సోషల్​ మీడియాలో పేర్కొంది. ఈ క్రమంలో హవా బలోచ్​ ఆఖరిగా మాట్లాడిన మాటల వీడియో, ఆమె ఫొటోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి.

పాక్​ సైన్యం పిరికిది..

చనిపోవడానికి ముందు హవా బలోచ్​ మాట్లాడిన వీడియోల ఏముందంటే.. “పాక్​సైన్యం పిరికిది. మమ్మల్ని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేదు. అందుకే బలూచ్​ యోధుల్ని ఏమీ చేయలేక.. ఆడవాళ్లపై ప్రతాపం చూపిస్తోంది. బలూచ్​ ప్రజలారా మేల్కోండి. మనకు ఇంతకు మించిన దారి ఇంకొకటి లేదు” అంటూ తుపాకీ పట్టుకొని, చిరునవ్వుతో మాట్లాడింది. పాక్​ ఆర్మీపై కాల్పులు జరిపింది. ఆ తర్వాత కాసేపటికే ఆమె చనిపోయింది.

కాగా, బలూచిస్థాన్ (Balochistan)​ విముక్తి కోసం కొన్ని దశాబ్దాలుగా పాక్​ ఆర్మీతో బీఎల్​ఏ పోరాడుతోంది. ఈ క్రమంలో గతేడాది ‘హెరోఫ్​1’ పేరుతో కాల్పులు, ఆత్మాహుతి దాడులు చేసింది. ఇప్పుడు ‘హెరోఫ్​2’ పేరుతో భారీ స్థాయిలో విరుచుకుపడుతోంది. ఇందులో ముఖ్యంగా మహిళా ఆత్మాహుతి దళాలు పాక్​ సైన్యాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఈ ఘర్షణల్లో గత రెండు రోజుల నుంచి వందలమంది బలయ్యారు.

Read Also: ఏఐ మరో దెబ్బ.. అమెజాన్​ బాటలో ఒరాకిల్​!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>