కలం, సినిమా : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) మరోసారి తండ్రయ్యారు. ఆయనకు ఒక పాప, ఒక బాబు పుట్టారు. ఇప్పటికే ఆయనకు క్లింకార అనే పాప ఉంది. మొత్తం ముగ్గురు పిల్లల తండ్రిగా చరణ్ మారారు. రామ్ చరణ్, ఉపాసన (Upasana) దంపతులకు కవల పిల్లలు పుట్టడంతో నిన్నంతా మెగాభిమానులు సంబురాలు చేసుకున్నారు. ఈ క్రమంలో రామ్ చరణ్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ గతంలో మెగాస్టార్ వచ్చిన విమర్శలకు చెక్ పెట్టింది.
గతంలో మెగాస్టార్ చిరంజీవి ఓ ఫంక్షన్ లో మాట్లాడుతూ.. రామ్ చరణ్ ను ఒక వారసుడిని ఇవ్వమని అడుగుతున్నానని, మన లెగసీని ముందుకు తీసుకెళ్లే మగబిడ్డను ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నానని అన్నారు. దాంతో మెగాస్టార్ వారసత్వాన్ని మనవడే తీసుకెళ్తాడా, మనవరాలు తీసుకెళ్లదా అంటూ ట్రోల్స్ మొదలయ్యాయి. అంతే కాకుండా నేషనల్ లెవల్లో చిరంజీవి పై విమర్శలు వచ్చాయి. అయితే.. మెగాస్టార్ అప్పుడు మౌనం వహించారు కానీ.. రియాక్ట్ కాలేదు.
అయితే.. ఇప్పుడు ఆ విమర్శలకు చెక్ పెడుతూ రామ్ చరణ్ (Ram Charan) తన కుటుంబంలోని మహిళలే గొప్ప బలం అని, ఇద్దరు కుమార్తెలను పొందినందుకు జీవితం పట్ల కృతజ్ఞతగా ఉన్నానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చరణ్ స్పందించిన విధానంతో మెగా కుటుంబం మహిళల పట్ల ఎంతటి గౌరవంతో ఉంటారో, ఎలాంటి ప్రేమాభిమానాలు చూపిస్తారో అర్థమవుతోంది.
Read Also: ఆ కుర్రాళ్లకు మంచి ఛాన్స్..
Follow Us On: Instagram


