epaper
Tuesday, November 18, 2025
epaper

నాసా అంగారకక మిషన్ సక్సెస్

NASA Escapade Mission | అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఎస్కపేడ్’ మార్స్ విజయవంతమైంది. అంతరిక్ష పరిశోధనలో తాము మరో కీలక ఘట్టానికి చేరుకున్నామని నాసా అధికారులు వెల్లడించారు. ఫ్లోరిడా కేప్‌ కెనవెరల్‌ స్పేస్‌ స్టేషన్ నుండి లాంచ్ అయిన ఈ ప్రయోగంలో, జెఫ్‌ బెజోస్‌కు చెందిన ‘బ్లూ ఆర్జిన్’ రాకెట్ ‘న్యూ గ్లెన్‌’ ఉపయోగపడింది. ఈ రాకెట్ తిరిగి భూమికి సురక్షితంగా చేరుకున్నది.

ముఖ్యంగా ఈ మిషన్‌(NASA Escapade Mission)లో రెండు ఉపగ్రహాలు అంగారకుడి వాతావరణాన్ని పరిశీలించనున్నాయి. ఇవి మార్స్ వాతావరణం ఎలా కోల్పోయిందో, అయస్కాంత క్షేత్రం, ప్లాస్మా పరిస్థితులు ఎలా ఉన్నాయో గుర్తించేందుకు కీలకమైన డేటాను సేకరిస్తాయి. దీనివల్ల భవిష్యత్తులో మార్స్‌లో నివాసయోగ్యత, మార్స్ పరిణామాన్ని అర్థం చేసుకోవడానికి కొత్త అవగాహన ఏర్పడే అవకాశం ఉంది.

ఈ ప్రయోగం రీ-యూజబుల్ రాకెట్ సాంకేతికతను చూపిస్తూ, అంతరిక్ష పరిశోధనలో బ్లూ ఆర్జిన్‌ స్పేస్‌ఎక్స్‌కు ప్రత్యర్థిగా నిలబడే అవకాశం ఉన్నట్లు నిరూపిస్తోంది. అంతేకాదు, నాసా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ మిషన్ ద్వారా భవిష్యత్ అంతరిక్ష ప్రయాణాలు, రోబోటిక్ మార్స్ సైన్స్, భారీ వాణిజ్య రాకెట్‌ అభివృద్ధికి దారితీసే సంకేతాలు కనిపిస్తున్నాయి.

Read Also: పుణేలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది సజీవ దహనం

Follow Us on: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>