కలం డెస్క్ : జూబ్లీహిల్స్(Jubilee Hills) అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికలో బీజేపీ(BJP) డిపాజిట్ కోల్పోయింది. తొలి రౌండ్ నుంచీ మూడవ స్థానానికే పరిమితమైంది. తొలి ఎనిమిది రౌండ్లలో ఆయనకు పది వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) అంచనా రుజువైంది. ఈసారి డిపాజిట్ కూడా రాదు.. రాసి పెట్టుకోండి… ఫలితాల తర్వాత నా మాటలు నిజమవుతాయో లేదో.. మీరే చూసుకోండి.. అంటూ మీడియా సమావేశాల్లో బహిరంగంగానే ప్రకటించారు. ఆ అంచనాకు తగినట్లుగానే బీజేపీ థర్డ్ ప్లేస్‌కు పరిమితం కావడంతో పాటు డిపాజిట్ కోల్పోయింది. గతంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ తరఫున పోటీ చేసిన ఆయన డిపాజిట్ కోల్పోయారు.
Jubilee Hills | తొలిసారి పోటీ చేసినప్పుడు (2023 డిసెంబరులో) ఆయన 14% ఓట్లను మాత్రమే పొందగలిగారు. డిపాజిట్ కోల్పోయారు. ఇప్పుడు అదే స్థానం నుంచి ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున రెండోసారి పోటీ చేసినా గతంలో వచ్చినన్ని ఓట్లను కూడా రాబట్టుకోలేకపోయారు. మొత్తం పది రౌండ్లలో ఎనిమిది రౌండ్లు ముగిసేటప్పటికి ఆయనకు 10 వేల పైచిలుకు ఓట్లు మాత్రమే వచ్చాయి. గతంలో దాదాపు 26 వేల (25,866) ఓట్లను రాబట్టగలిగినా ఈసారి అందులో సగం కూడా సాధించలేకపోయారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ లాంటివారు మతం పేరుతో ప్రచారం చేసుకున్నా ఫలితం లేకపోయింది.
Read Also: పుణేలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది సజీవ దహనం
Follow Us on : Pinterest

