కలం, డెస్క్ : సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతోనే వైసీపీ నేతల ఇండ్లపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు మాజీ సీఎం జగన్ (YS Jagan). వైసీపీ నేతలు ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక టీడీపీ ఇలాంటి దాడులు చేస్తోందన్నారు. మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటిపై టీడీపీ నేతల దాడిని జగన్ (YS Jagan) ఖండించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని చెప్పారు. ‘ప్రశ్నించే వారిని ఇబ్బంది పెట్టేందుకే సీఎం చంద్రబాబు ఇలాంటి హింసాజ్వాలను రాజేస్తున్నారు. కానీ అవే జ్వాలలు సీఎం చంద్రబాబు ప్రభుత్వాన్ని దహించి వేస్తాయి అని గుర్తు పెట్టుకోవాలి’ అంటూ తెలిపారు మాజీ సీఎం జగన్.


