కలం, వెబ్ డెస్క్ : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ నోటీసులు, దర్యాప్తు పై మాజీ మంత్రి హరీశ్ (Harish Rao) రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇది దర్యాప్తు కాదని, కేవలం ప్రతిపక్ష నేతపై జరుగుతున్న ప్రతీకార దాడి అని ఆయన విమర్శించారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని, నోటీసుల జారీలో కనీస చట్టపరమైన విధానాలను పాటించలేదని ఆరోపించారు.
కేసీఆర్ (KCR) ఎక్కడ ఉంటున్నారో రాష్ట్రం మొత్తానికి తెలుసని, ఇంటెలిజెన్స్ నిఘా ఉన్నా సరే నందినగర్ గోడలకు నోటీసులు అంటించడం చౌకబారు రాజకీయానికి నిదర్శనమని పేర్కొన్నారు. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన నాయకుడికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే మర్యాద ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. SIT – అంటే అది స్వతంత్ర సంస్థ కాదని, CIT – ముఖ్యమంత్రి ఆదేశాలతో నడిచే సీఎం ఇన్‌స్ట్రక్షన్ టీమ్ అని హరీశ్ రావు అన్నారు. విదేశాల్లో ఉన్న ముఖ్యమంత్రి ఫోన్ చేసి ఆదేశిస్తుంటే పోలీసులు చట్టాన్ని, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ పనిచేస్తున్నారని విమర్శించారు.
ప్రభుత్వం తన వైఫల్యాలను, కుంభకోణాలను పక్కదారి పట్టించేందుకే ఇటువంటి డ్రామాలు ఆడుతోందని ఆరోపించారు. కేసీఆర్ బాధ్యతాయుతమైన పౌరుడిగా దర్యాప్తుకు సహకరిస్తున్నా, పోలీసులు కావాలనే అతి చేస్తూ బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి ప్రతిపక్షాలను టార్గెట్ చేయడం కాంగ్రెస్ భయానికి చిహ్నమని, ప్రజల గుండెల్లో ఉన్న కేసీఆర్ పేరును ఇలాంటి కేసులతో చెరిపివేయలేరని హరీశ్ రావు (Harish Rao) తెలిపారు.
Read Also: బీసీలకు 70శాతం సీట్లు కేటాయించాం.. మంత్రి కోమటిరెడ్డి
Follow Us On: X(Twitter)


