epaper
Sunday, February 1, 2026
spot_img
epaper

అమెరికాను వెనక్కి నెట్టిన భారత్​.. గ్లోబల్​ జీడీపీపై మస్క్​ ట్వీట్​

కలం, వెబ్​డెస్క్​: ప్రపంచ ఆర్థిక వృద్ధిపై స్పేస్​ఎక్స్ అధినేత, బిలియనీర్​ ఎలాన్​ మస్క్ (Elon Musk)​ ఆసక్తికర ట్వీట్​ చేశాడు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనాల ఆధారంగా విడుదల చేసిన ఓ చార్ట్​ను తన ట్వీట్​కు ఆయన జత చేశారు. ఈ చార్ట్​లో ఏముందంటే.. 2026లో ప్రపంచ జీడీపీ వృద్ధిలో అధిక వాటా పంచుకోబోయే 10 దేశాల పేర్లు ఉన్నాయి.

జాబితాలో మొదటి రెండు స్థానాల్లో చైనా, భారత్​ ఉండగా అమెరికా థర్డ్​ ప్లేస్​లో నిలిచింది. చైనా 26.6శాతం వాటాతో టాప్​లో ఉండగా, ఇండియా 17శాతంతో సెకండ్​ ప్లేస్​లో ఉంది. అమెరికా 9.9శాతంతో థర్డ్​ ప్లేస్​లో నిలిచింది. మిగిలిన స్థానాల్లో వరుసగా ఇండోనేషియా(3.8%), తుర్కియే(2.2%), నైజీరియా(1.5%), బ్రెజిల్​(1.5%), వియత్నాం(1.6%), సౌదీ అరేబియా(1.7%), జర్మనీ(0.9%)తో ఉన్నాయి. అలాగే చైనా, భారత్​ కలసి 43.6శాతం; ఆసియా–పసిఫిక్​ వాటా 50శాతం ఉన్నట్లు చార్ట్​లో ఉంది.

ఈ చార్ట్​ను తన ట్వీట్​కు జతచేసిన మస్క్​ దానిపైన ‘ది బ్యాలెన్స్​ ఆఫ్​ పవర్​ ఈజ్​ ఛేంజింగ్​’ అని రాశారు. ప్రపంచ ఆర్థిక వృద్ధిలో అధిక వాటా, అధికార కేంద్రం మారుతోందనే అర్థంలో మస్క్​ ట్వీట్ చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, ఇటీవల కొంతకాలంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అస్థిరత; వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగిపోవడం; చైనా, భారత్​ను లక్ష్యంగా చేసుకొని ట్రంప్​ ఎడాపెడా సుంకాలు విధించడం తెలిసిందే.

ఈ నేపథ్యంలో గ్లోబల్​ ఎకనమిక్​ పవర్​ మారుతోందనే దానికి సంకేతంగా ఐఎంఎఫ్​ అంచనాలు ఉన్నాయని మస్క్ (Elon Musk)​ పేర్కొనడం ఆసక్తి కలిగిస్తోంది. ఇది పరోక్షంగా ట్రంప్​ విధానాలను మస్క్​ విమర్శిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో ట్రంప్​కు మద్దతు తెలిపిన మస్క్​, అనంతరం విభేదాల కారణంగా పరస్పరం విమర్శించుకుంటున్న సంగతి తెలిసిందే.

కాగా, మస్క్​ ట్వీట్​లోని ఛార్ట్​లో పేర్కొన్న గ్రోత్​ రేట్​లో భారత్​.. అమెరికాను వెనక్కు నెట్టి రెండో స్థానంలో నిలవడంపై ఎన్​డీఏ అనుకూల నెటిజన్లు సోషల్​ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Read Also: ముగిసిన మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>