epaper
Sunday, February 1, 2026
spot_img
epaper

వాళ్లు తప్పు చేస్తే నేనెందుకు క్షమాపణ చెప్పాలి.. సీఎం చంద్రబాబు ఆగ్రహం

కలం, డెస్క్ : తిరుమల కల్తీ నెయ్యి కేసు (Spurious Ghee Case) మీద సిట్ విచారణ వేస్తే తననే క్షమాపణ చెప్పమంటారా అంటూ సీఎం చంద్రబాబు (Chandrababu) ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఆయన సిట్ విచారణపై స్పందించారు. ‘శ్రీవారి లడ్డూలో వాడే నెయ్యిని వైసీపీ హయాంలో కల్తీ చేసి మహాపచారం చేశారు. వాళ్ల పాపాలను కప్పిపుచ్చుకోడానికి నా క్యారెక్టర్ మీద బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్టీడీబీ ఇచ్చిన రిపోర్టులో జంతువుల కొవ్వు ఉందని వచ్చింది. ఆ నివేదికను బట్టే నేను మాట్లాడాను. నా వ్యాఖ్యలపై నానా యాగి చేశారు. ఇందులో నిజాలను తేల్చాలనే ఉద్దేశంతోనే సిట్ వేశాను. వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడాలనే ఉద్దేశమే నాకు ఉంది. కానీ సిట్ విచారణ వేసినందుకు నన్ను క్షమాపణ చెప్పమంటున్నారు. వైసీపీ నేతల కుంభకోణాలను కప్పిపుచ్చుకోడానికే ఇలా రివర్స్ లో మాటల దాడులు చేస్తున్నారు’ అంటూ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సిట్ విచారణలో కల్తీ జరిగిందని తేలిందని.. దాన్ని డైవర్ట్ చేయడానికే ఇలా తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు సీఎం చంద్రబాబు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఈ జన్మలోనే శిక్ష తప్పదని.. తాను అలాంటి ఘటనలు కళ్లారా చూశానంటూ చెప్పుకొచ్చారు సీఎం చంద్రబాబు (Chandrababu).

Read Also: జోగి రమేశ్ ఇంటికి నిప్పు పెట్టిన టీడీపీ కార్యకర్తలు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>