ఢిల్లీ ఎర్రకోటలోని పేలుళ్ల(Red Fort Blast) ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు, భద్రతా బలగాలు నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా పేలుడు ఘటనలో కీలక సూత్రదారి డాక్టర్ ఉమర్ నబీ(Dr Umar Nabi) నివాసాన్ని భద్రతా బలగాలు పేల్చేశాయి. గురువారం అర్ధరాత్రి ఇంటిని పేల్చేసినట్టు అధికారులు తెలిపారు. గత సోమవారం ఎర్రకోట వద్ద సంభవించిన పేలుడులో 13 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. హ్యుండాయ్ ఐ20 కారు పేలుడుకు కారణమని పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్, డీఎన్ఏ పరీక్షల ఆధారంగా కారును నడిపిన వ్యక్తి డాక్టర్ ఉమర్ నబీనే అని తేలింది. ఈ ఘటనలో ఉమర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు.
భద్రతా బలగాలు ఈ కేసు(Red Fort Blast)లో దర్యాప్తు కొనసాగిస్తూ, ఉమర్ నబీ నివాసాన్ని ధ్వంసం చేశారు. ఉమర్ జమ్మూకశ్మీర్ పుల్వామా ప్రాంతంలోని ఉగ్ర మాడ్యూల్‌తో సంబంధాలు కలిగి ఉన్నాడని అధికారులు గుర్తించారు. ప్రస్తుతం, ఆ మాడ్యూల్ వెనుక ఎవరున్నారు? అంతకుముందు ఉన్న కుట్రలలో అతని పాత్ర ఏమిటో తెలుసుకోవడానికి దర్యాప్తు కొనసాగుతోంది. ఈ పేలుడు అతి పెద్ద ఉగ్రవాద కుట్రలో భాగమేనని ఇప్పటికే నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ దిశగా ప్రస్తుతం దర్యాప్తు సాగుతోంది. ఉగ్ర మాడ్యూల్ పట్ల ఇప్పటికే సేనలు నిఘా పెంచగా, ఈ నెట్‌వర్క్‌కు దేశం లోపల లేదా బయట ఉన్న మద్దతుదారులు ఎవరో అన్వేషిస్తున్నారు.
Read Also: ఒక్క ఫలితం – మూడు పార్టీలపై ఎఫెక్ట్
Follow Us on: Youtube

