కలం, వరంగల్ బ్యూరో : 10 ఏళ్ల కాలంలో బిఆర్ఎస్ (BRS) ఫోన్ ట్యాపింగ్ ను ఆయుధంగా మలుచుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఆరోపించారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యేలు మురళి నాయక్, కోరం కనకయ్య, డీసీసీ అధ్యక్షులు ఉమా మురళి నాయక్, దేవి ప్రసన్నలతో కలిసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం ప్రతిపక్ష నేతలు, ఉద్యోగులు, ప్రజా సంఘాల నాయకులు, అధికారులు, జర్నలిస్టులు రియల్ ఎస్టేట్ వ్యాపారులపై నిరంతర నిఘా పెట్టిందని అన్నారు. తమ అధికారానికి అక్రమాలకు అడ్డగా హైకోర్టు జడ్జిలు , ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ల ఫోన్లు ట్యాపింగ్ చేశారని అన్నారు.కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ స్వతంత్ర ఉద్యమ పార్టీ దేశంలో అనేక సంవత్సరాలు పరిపాలించిన పార్టీ బాధ్యత గల సమర్థవంతమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకున్న పార్టీ కాంగ్రెస్ అని మంత్రి తెలిపారు.
తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నవారితో పోరాడిన గడ్డ నుండి మాట్లాడుతున్నా.. తెలంగాణ ఏర్పడిన తరువాత ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాల్సిన ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరించిందని అన్నారు. ప్రజాస్వామ్యవాదులు, ప్రతిపక్ష పార్టీల నేతలు సొంత కుటుంబాలలో అల్లుడు ఏం మాట్లాడుతున్నారో వినడానికి ఫోన్ ట్యాపింగ్ చేసిన పరిస్థితికి దిగ జారిందన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల ఫోన్లు విని దొంగదారిన గెలిచే ప్రయత్నం చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి అనుమతి లేకుండా ఫోన్ ట్యాపింగ్ పరికరాలు తెచ్చి ఇంత పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ చేయడం సాధ్యం అవుతుందా..? అని ప్రశ్నించారు.
బిఆర్ఎస్ ఓడిపోయింది కనుకనే ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) పరికరాలు ధ్వంసం చేశారని అన్నారు. కక్ష సాధింపులకు నోటీసులు అనడానికి సిగ్గు ఉండాలని, తప్పు జరిగినప్పుడు ఏ స్థాయి వ్యక్తులనైనా పోలీసులు విచారణ చేస్తారని, తప్పు చేసినప్పుడు శిక్షలు తప్పవని తెలిపారు. కేసీఆర్ ను విచారణకి పిలిస్తే ధర్నాలు, బంద్ లు చేస్తామని పిలుపునిచ్చి పాల్గొంటున్న అనేక మంది నేతల ఫోన్ లు ట్యాపింగ్ చేసి ఉంటారని ఆరోపించారు. ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని మంత్రి పొన్నం (Ponnam Prabhakar) డిమాండ్ చేశారు.
Read Also: బడ్జెట్ ఎఫెక్ట్ : ధరలు తగ్గేవి, పెరిగేవి ఇవే..
Follow Us On: Sharechat


