కలం, వెబ్‌డెస్క్: వికసిత్ భారత్’ (Viksit Bharat) లక్ష్యం దిశగా, దేశ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చేలా కేంద్ర బడ్జెట్ ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. పార్లమెంట్లో ఆదివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్‌పై ప్రధాని స్పందించారు. ఈ బడ్జెట్ 140కోట్ల భారతీయుల ఆకాంక్షలకు ప్రతిబింబిస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ బడ్జెట్ దేశంలో సంస్కరణల ప్రయాణాన్ని బలోపేతం చేస్తుందన్నారు. మూడో ఆర్థిక శక్తిగా అవతరించేందుకు దోహదం చేస్తుందని పేర్కొన్నారు. ఇది ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని నెరవేర్చే బడ్జెట్ అని ప్రధాని పేర్కొన్నారు.
మౌలిక సదుపాయాల కల్పనకు ఈ బడ్జెట్ పెద్దపీట వేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) చెప్పారు. హైస్పీడ్ రైలు కారిడార్ల ఏర్పాటుకు ప్రోత్సాహం ఇస్తుందన్నారు. స్వదేశీ తయారీకి రూపొందించిన ‘ఆత్మ నిర్బర్’కు ఊతమిచ్చేలా ఉందని చెప్పారు. చరిత్రాత్మక బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు.
Read Also: సిట్ విచారణ.. కేసీఆర్ భావోద్వేగం..!
Follow Us On: Youtube


