కలం, వెబ్ డెస్క్ : కేంద్ర బడ్జెట్ (Budget 2026) ను విత్త మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఈ ఆర్థిక పద్దులో నిర్మలమ్మ సామాన్యలకు కొన్ని తీపి కబుర్లు చెబితే మరికొన్ని చేదు విషయాలను వెల్లడించింది. అత్యవసర మందులు, ఈవీ బ్యాటరీస్, స్మార్ట్ ఫోన్లు లాంటి వస్తువుల ధరలు తగ్గనుండగా లగ్జరీ వాచ్ లు, ఫెర్టీలైజర్లు రేట్లు పెరిగే అవకాశాలున్నాయి.
చౌకగా లభించే వస్తువులు : మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ విడి భాగాలు, బంగారం, వెండి, సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వెహికిల్స్, క్యాన్సర్, షుగర్ మందులు, టెలికాం పరికరాలు, సీఎన్జీ, బయోగ్యాస్ ధరలు, చెప్పులు, షూలు, మత్స్యకారులు పట్టిన చేపలు, లెదర్ వస్తువుల ధరలు తగ్గనున్నాయి.
ధరలు పెరిగేవి : లిక్కర్ ధరలు, విదేశీ కార్లు, కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు, ప్లాస్టిక్ సామగ్రి, బొగ్గుపై పన్నులు, సిగరెట్లు, పోగాకు ధరలు పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
Read Also: పర్యావరణ సవాళ్లపై పోరాటానికి అరకొరే
Follow Us On: Sharechat


