కలం, డెస్క్ : మాజీ మంత్రి అంబటి రాంబాబును (Ambati Rambabu) పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గుంటూరు ఎస్పీకి టీడీపీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యాల రావు ఫిర్యాదు చేశారు. ఉదయం నుంచి రాంబాబు ఇంటి వద్ద హైడ్రామా నడిచింది. రాంబాబు అరెస్ట్ కు టీడీపీ నేతలు పట్టుబట్టారు. ఆయన ఇంటి వద్ద భారీగా టీడీపీ కార్యకర్తలు మోహరించి ఆందోళన చేశారు. ఉద్రిక్తతల నడుమ పోలీసులు రాంబాబును అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.


