కలం, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి హక్కులు, వాటాపై కేంద్ర జల శక్తి శాఖ భేటీ జరిగింది. ఈ భేటీపై తెలంగాణ ఇంజినీర్లు, నిపుణులు ముఖ్యమైన అంశాలను లేవనెత్తి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) శుక్రవారం మీడియాముందుకొచ్చి కీలక విషయాలను వెల్లడించారు. కృష్ణా, గోదావరి నది జలాల్లో ఒక్క చుక్క నీటిని కూడా తెలంగాణ ప్రభుత్వం వదులుకోదని ఆయన స్పష్టం చేశారు.
నీటి వాటాల పంచాయితీ (Water Disputes) వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, నీటి హక్కుల కోసం సర్వశక్తులు ఒడ్డుతూ పోరాటం చేస్తున్నామని ఆయన అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్కు ఖర్చు చేసింది కేవలం రూ.1.84 లక్షల కోట్లు మాత్రమే ఆయన గుర్తుచేశారు. ఒక్క ఎకరానికి కూడా నీరు ఇవ్వకుండా ఇరిగేషన్ శాఖను బీఆర్ఎస్ నాశనం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) విమర్శించారు.
Read Also: కేసీఆర్ వర్సెస్ సిట్.. అఫీషియల్ రెసిడెన్స్ నందినగరే…
Follow Us On: X(Twitter)


