కలం, డెస్క్ : ప్రముఖ విద్యాసంస్థ బిట్స్ పిలానీ (BITS Pilani) ఏపీ రాజధాని అమరావతిలో క్యాంపస్ ను నిర్మించేందుకు ఆ సంస్థ ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా సీఆర్డీఏతో నేడు కీలక ఒప్పందం చేసుకున్నారు బిట్స్ పిలానీ సంస్థ ప్రతినిధులు. తుళ్లూరు మండలం, మందడం, వెంకటపాలెం గ్రామ పరిధిలో దాదాపు 70 ఎకరాలను బిట్స్ పిలానీకి ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు బిట్స్ పిలానీ (BITS Pilani) ప్రతినిధులతో సీఆర్డీఏ ఎస్టేట్ జాయింట్ డైరెక్టర్ వి.డేవిడ్ రాజు, మందడం సబ్ రిజిస్ట్రార్ సి.హెచ్.రాంబాబు సమక్షంలో ఈ భూమి కేటాయింపులపై కీలక ఒప్పందం జరిగింది. అయితే అమరావతిలో మూడు దశల్లో బిట్స్ పిలానీ తన క్యాంప్ ను డెవపల్ చేయబోతోంది. మొదటి దశలో దాదాపు వెయ్యి కోట్లు పెట్టుబడి పెడుతున్నారు బిట్స్ పిలానీ ప్రతినిధులు. రాబోయే 2027 విద్యా సంవత్సరం నుంచే ఈ క్యాంపస్ లో ప్రవేశాలు ఉండబోతున్నాయి.


