ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రాబోతున్నది. గ్రీన్ ఎనర్జీ రంగంలో 82 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ప్రముఖ సంస్థ రెన్యూ పవర్(ReNew Power) ముందుకొచ్చింది. ఈ మేరకు ఐటీ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) గురువారం ట్వీట్ చేశారు. రెన్యూ పవర్ సౌరశక్తి, బయోఎనర్జీ వంటి విభాగాల్లో భారీ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలను సృష్టించనున్నాయి. స్థానిక ఆర్థిక వ్యవస్థలో వేగవంతమైన అభివృద్ధి, పునరుత్పాదక శక్తి(Renewable Energy) ఉత్పత్తి పెంపొందనున్నది. “గత ఐదేళ్లలో మేము రాష్ట్రంలో మినిమం ప్రాజెక్టులు మాత్రమే చేపట్టాం. కానీ ఇప్పుడు, రెన్యూ పవర్ కొత్త పెట్టుబడితో గ్రీన్ ఎనర్జీ విప్లవానికి దారితీస్తుంది. ఇది రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, పరిశ్రమల ఆకర్షణకు కీలకంగా ఉంటుంది” అని చెప్పారు.
ఈ పెట్టుబడితో రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. పునరుత్పాదక శక్తి పెరగనున్నది. పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తుందని పారిశ్రామిక నిపుణులు చెబుతున్నారు. రెన్యూ పవర్(ReNew Power) పెట్టుబడి రాష్ట్రానికి సుస్థిర, దీర్ఘకాలిక, పర్యావరణ హితమైన ఆర్థిక లాభాలను అందించనుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతంగా అమలు అయితే, ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ రంగంలో అగ్రశ్రేణి రాష్ట్రాల జాబితాలో చేరే అవకాశముంది.
Read Also: గోల్డ్ మెడల్స్‌లో 80శాతం అమ్మాయిలకే.. అబ్బాయిలకు గవర్నర్ హెచ్చరిక
Follow Us on: Instagram

