కలం, డెస్క్ : క్రెడిట్ కార్డులు వాడుతున్న వారు ఎక్కువగా ఆఫర్లు, క్యాష్ బ్యాక్, రివార్డు పాయింట్లనే ఆశిస్తుంటారు. అయితే ఫిబ్రవరి 1 నుంచి ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డుల (ICICI Credit Cards) విషయంలో కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది. ఇందులో కస్టమర్లకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ క్రెడిట్ కార్డులపై ఇప్పటి వరకు వస్తున్న రివార్డు పాయింట్లు, క్యాష్ బ్యాక్, ఫ్రీ టికెట్లును తగ్గించేసింది ఈ బ్యాంకు. అలాగే కొత్త ఛార్జీలను కూడా విధిస్తున్నట్టు తెలిపింది ఐసీఐసీఐ బ్యాంకు. అవేంటో ఒకసారి చూద్దాం.
తగ్గనున్న రివార్డులు..
ఇప్పటి వరకు ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుల (ICICI Credit Cards) ద్వారా.. రవాణా, ఇన్సూరెన్స్ చెల్లింపుల మీద కొన్ని రివార్డు పాయింట్లు వచ్చేవి. కానీ ఫిబ్రవరి 1 నుంచి వాటిని తగ్గించబోతోంది. రూబిక్స్, సఫిరో లాంటి క్రెడిట్ కార్డులపై గతంలో రూ.10వేలకు పైగా పేమెంట్స్ చేస్తే రివార్డు పాయింట్లో వచ్చేవి. కానీ ఇక నుంచి రూ.20వేలకు పైగా పేమెంట్లు చేస్తేనే రివార్డు పాయింట్లు వస్తాయి. అలాగే హెచ్ పీసీఎల్ సూపర్ సేవర్ కార్డు మీద అయితే రూ.40వేలకు పైగా పేమెంట్లు చేస్తేనే రివార్డు పాయింట్లు ఇస్తుంది బ్యాంకు. ఇంతకు ముందు బుక్ మై షో ద్వారా ఐసీఐసీఐ ప్లాటినం క్రెడిట్ కార్డు మీద టికెట్లు బుక్ చేసుకుంటే ఆఫర్లు వచ్చేవి. ఇక నుంచి ప్లాటినం క్రెడిట్ కార్డు మీద ఈ ఆఫర్లు రావు.
కొత్త ఛార్జీలు..
ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులపై కేవలం రివార్డు పాయింట్లలో పరిమితి విధించడమే కాకుండా.. కొత్త ఛార్జీలను కూడా విధిస్తోంది. ఫిబ్రవరి 1 నుంచి రవాణా ఖర్చులు నెలకు రూ.50వేలు దాటితే.. ఆ పైన చేసే పేమెంట్లపై 1 శాతం ఛార్జీలు చెల్లించాల్సిందే. ఇక ఆన్ లైన్ గేమింగ్స్ కోసం డ్రీమ్ 11, ఎంపీఎల్ లాంటి గేమింగ్ ప్లాట్ ఫామ్ లో చేసే పేమెంట్స్ మీద 2 శాతం ఛార్జీలు విధించబోతోంది ఐసీఐసీఐ బ్యాంకు. క్రెడిట్ కార్డు మార్కెట్ లో పెరుగుతున్న ఖర్చుల వల్లే బ్యాంకు ఇలాంటి నిర్ణయం తీసుకుందని అంటున్నారు ట్రేడ్ నిపుణులు.
Read Also: ‘డబుల్’ ఇండ్లన్నీ హౌజింగ్ కార్పొరేషన్‌కే.. ప్రభుత్వ సర్క్యులర్ జారీ
Follow Us On: X(Twitter)


