కలం, వెబ్ డెస్క్: ముంబై (Mumbai) ఎయిర్పోర్ట్ సమీపాన కేవలం 400 మీటర్ల దూరంలో ఉన్న ఫైవ్‌స్టార్ హోటల్‌కు తీసుకెళ్లేందుకు ఓ ట్యాక్సీ డ్రైవర్ రూ.18,000 వసూలు చేశాడు. అమెరికా మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఇటీవల అమెరికా నుంచి ముంబైకి వచ్చిన మహిళ ఎయిర్‌పోర్ట్‌లో ట్యాక్సీ ఎక్కింది. కేవలం 20 నిమిషాల జర్నీకే రూ.18,000 (సుమారు 200 డాలర్లు) వసూలు చేసి హోటల్ దగ్గర డ్రాప్ చేశాడు. ఈ ఘటనపై బాధిత మహిళ జనవరి 26న ట్విటర్లో అనుభవాన్ని షేర్ చేసుకుంది. ఈ పోస్ట్ లక్షకు పైగా వ్యూస్ రావడంతో నెటిజన్స్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ముంబై పోలీసులు జనవరి 27న కేసు నమోదు చేశారు.
పోస్ట్‌లో పేర్కొన్న ట్యాక్సీ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా 50 ఏళ్ల దేశ్రాజ్ యాదవ్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసిన మూడు గంటల్లోనే డ్రైవర్‌ను అరెస్ట్ చేసి, ట్యాక్సీని స్వాధీనం చేసుకున్నారు. మహిళ బస చేసిన హోటల్ నుంచి కూడా పోలీసులు (Police) వివరాలు సేకరించారు. ఈ ఘటనలో పాత్ర ఉన్న రెండో వ్యక్తి కోసం గాలింపు కొనసాగుతోందని, డ్రైవర్ లైసెన్స్ రద్దు ప్రక్రియ కోసం ఆర్టీవోకు సమాచారం ఇచ్చినట్లు వెల్లడించారు. ఇలాంటి మోసాలకు గురైతే వెంటనే 112కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.
Read Also: వారెవ్వా అల్కరాజ్.. అనారోగ్యంతోనే అద్భుత పోరాటం
Follow Us On : WhatsApp


