కలం, వెబ్ డెస్క్ : బెంగళూరుకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ‘కాన్ఫిడెంట్ గ్రూప్’ వ్యవస్థాపకుడు (Confident Group CEO), ఛైర్మన్ డాక్టర్ సీజే రాయ్ (57) శుక్రవారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నారు. రిచ్మండ్ సర్కిల్ సమీపంలోని తన కార్యాలయంలో ఆయన తన లైసెన్స్డ్ రివాల్వర్‌తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
ఆదాయపు పన్ను (IT) శాఖ అధికారులు రాయ్ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్న సమయంలోనే ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పన్ను ఎగవేత ఆరోపణలపై అధికారులు ఆయనను (Confident Group CEO) సుమారు గంటన్నర పాటు ప్రశ్నించినట్లు సమాచారం. అధికారులు పత్రాలను పరిశీలిస్తున్న సమయంలో, ఆయన (CJ Roy) తన గదిలోకి వెళ్లి తుపాకీతో కాల్చుకున్నారు. ఘటన జరిగిన వెంటనే అక్కడి సిబ్బంది, ఐటీ అధికారులు ఆయన్ను ఆస్పత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: ఫెడ్ కు కొత్త చీఫ్.. కూలిన స్టాక్ మార్కెట్లు!
Follow Us On: Sharechat


