epaper
Tuesday, November 18, 2025
epaper

టీమిండియాలోకి హైదరాబాద్ యువ కెరటం..

భారత్ క్రికెట్ జట్టులోకి హైదరాబాద్‌కు చెందిన యువ క్రికెట్ కెరటం చేరింది. హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ మాలిక్‌(Mohammed Malik)కు అండర్-19 జట్టులో స్థానం దక్కింది. ఫాస్ట్ బౌల్‌గా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న మాలిక్‌కు ఇదొక అద్భుత అవకాశమని ఫ్యాన్స్ అంటున్నారు. నాంపల్లి మల్లెపల్లికి చెందిన మాలిక్.. క్రికెట్ వినూ మన్కడ్ ట్రోఫీలో తన ప్రదర్శనతో అదరగొట్టాడు. టోర్నీలో అత్యధిక వికెట్లు తీసు ప్రత్యర్థులకు సింహస్వప్నంలా మారాడు.

తన ఆటతీరుతో సెలక్టర్ల దృష్టికి ఆకర్షించాడు. దీంతో అతడికి అండర్-19లో చోటు దక్కిస్తూ బీసీసీఐ(BCCI) నిర్ణయం తీసుకుంది. ఈనెల 17న బెంగళూరులో అప్ఘనిస్థాన్‌తో జరిగే సిరీస్‌లో టీమిండియా తరుపున బరిలోకి దిగనున్నాడు. ఈ అవకాశం స్పందించిన మాలిక్(Mohammed Malik).. తనకు ఇదొక సువర్ణ అవకాశం అని, తనకు చాలా సంతోషంగా ఉందని అన్నాడు. అతని ఎంపికపై స్నేహితులు, కోచ్‌లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాలిక్ అతి త్వరలోనే టీమిండియాకు ప్రాతినిధ్యం వహించే అవకాశాలు ఉన్నాయని ఆభిప్రాయపడ్డారు.

Read Also: ప్రవీణ్ ప్రకాశ్ బహిరంగ క్షమాపణ

Follow Us on: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>