రాయలసీమ యూనివర్శిటీ(Rayalaseema University) స్నాతకోత్సవంలో పాల్గొన్న ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్(Governor Abdul Nazeer).. బాలురకు కీలక హెచ్చరిక చేశారు. గోల్డ్ మెడల్స్ వచ్చిన వారిలో 80 శాతం మంది అమ్మాయిలే ఉన్నారని, ఇది అబ్బాయిలకు హెచ్చరిక అని ఆయన పేర్కొన్నారు. స్నాతకోత్సవంలో విద్యార్థులకు బంగారు పథకాలు అందించిన గవర్నర్.. ఇది బాలుర వైఖరికి అద్దం పట్టేలా ఉందన్నారు. ‘‘గోల్డ్ మెడల్స్ పొందిన వారిలో 80 శాతం మంది మహిళలే ఉన్నారు. ఇది అబ్బాయిలకు హెచ్చరిక వాళ్లు ఇంకా బాగా కష్టపడి బంగారు పథకాలు తెచ్చుకోవాలి.
విద్యతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దానిని నిర్లక్ష్యం చేయొద్దు. విద్య అనేది వ్యక్తిగత అభివృద్ధికి పునాది వేస్తుంది. ఉన్నత విద్య ఆర్థిక, సామాజిక అసమానతలను తొలగిస్తుంది. డిగ్రీలు యువతకు విలువైన పెట్టుబడి’’ అని ఆయన వివరించారు. ఏఐపై కూడా విద్యార్థులు ఫోకస్ పెట్టాలని ఆయన(Governor Abdul Nazeer) సూచించారు.
Read Also: ప్రవీణ్ ప్రకాశ్ బహిరంగ క్షమాపణ
Follow Us on : Pinterest

