epaper
Tuesday, November 18, 2025
epaper

ప్రవీణ్ ప్రకాశ్ బహిరంగ క్షమాపణ

వైసీపీ ప్రభుత్వ పాలన కాలంలో కీలకపాత్ర పోషించిన మాజీ ఐఏఎస్‌ అధికారి ప్రవీణ్‌ ప్రకాశ్‌(Praveen Prakash) ఇప్పుడు తన గత ప్రవర్తనపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. అప్పటి రోజుల్లో కొంతమంది అధికారుల పట్ల తాను వ్యవహరించిన తీరు సరైనది కాదని అంగీకరించారు. ముఖ్యంగా ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు(ABV), రిటైర్డ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి జాస్తి కృష్ణకిశోర్‌(Jasti Krishna Kishore)లకు బహిరంగంగా క్షమాపణలు తెలిపారు.

సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసిన వీడియోలో ప్రవీణ్‌ ప్రకాశ్‌(Praveen Prakash) మాట్లాడుతూ “సర్వీసులో ఉన్నప్పుడు తీసుకున్న కొన్ని నిర్ణయాలు, ఆ సమయంలో చేసిన కొన్ని చర్యలు ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే తగినవిగా అనిపించడం లేదు. ముఖ్యంగా వెంకటేశ్వరరావు, కృష్ణకిశోర్‌ వంటి ప్రతిభావంతులైన అధికారుల పట్ల న్యాయంగా వ్యవహరించలేకపోయానని హృదయపూర్వకంగా బాధపడుతున్నాను. వారికి క్షమాపణలు చెబుతున్నాను” అని అన్నారు.

ఆ కాలంలో ఆయన ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని పాలనా వ్యవస్థలో కీలక నిర్ణయాలలో ఆయన ప్రభావం ఉన్నదనే అభిప్రాయం అధికార, రాజకీయ వర్గాల్లో ఉండేది. ఇప్పుడు సర్వీసు నుండి విరమణ పొందిన అనంతరం, ఆయన చేసిన ఈ ఆత్మపరిశీలన వ్యాఖ్యలు రాజకీయంగా కూడా చర్చనీయాంశమయ్యాయి. మాజీ అధికారుల పట్ల ఆయన క్షమాపణలు తెలపడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. గత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి అనుకూలంగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్టు ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. అయితే తాజాగా పశ్చాతాపం ప్రకటించడం గమనార్హం.

Read Also: ఎట్టకేలకు ఆ నిజం అంగీకరించిన ట్రంప్

Follow Us on: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>