epaper
Friday, January 30, 2026
spot_img
epaper

కేసీఆర్‌కు మ‌రోసారి సిట్ నోటీసులు..!

క‌లం, వెబ్‌ డెస్క్‌: ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారంలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత‌ కేసీఆర్‌(KCR)కు సిట్ మ‌రోసారి నోటీసులు జారీ చేసేందుకు సిద్ధ‌మ‌వుతోంది. గురువారం సిట్(SIT) కేసీఆర్‌ను విచార‌ణ‌కు ఆదేశించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో కేసీఆర్ పీఏకు నోటీసులు అంద‌జేసి, ఆయ‌న‌ ఎంపిక చేసిన చోట‌నే విచార‌ణ చేప‌డ‌తామ‌ని కూడా వెల్ల‌డించారు. శుక్ర‌వారం రోజు విచార‌ణం సిద్ధం కావాల‌ని నోటీసుల‌లో పేర్కొన్నారు.

కానీ, కేసీఆర్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల నామినేష‌న్ల హ‌డావిడి వ‌ల్ల ఇప్పుడు విచార‌ణ‌కు హాజ‌రు కాలేన‌ని తెలిపారు. ఈ మేర‌కు సిట్‌కు ఓ లేఖ రాశారు. విచార‌ణ‌కు స‌హ‌క‌రిస్తాన‌ని, కొంత స‌మయం కావాలని కోరారు. ఈ నేప‌థ్యంలో సిట్ లీగల్ ఒపీనియన్ తీసుకున్న‌ తర్వాత మరోసారి నోటీసులు జారీ చేయాల‌ని భావిస్తోంది. కేసీఆర్ రాసిన‌ లేఖకు ఈరోజు సిట్‌ సమాధానం ఇవ్వనుంది. మ‌ళ్లీ కేసీఆర్‌కు 160 సీఆర్పీసీ కింద సిట్ నోటీసులు ఇచ్చి ఎలాగైనా విచార‌ణ చేస్తార‌న్న ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారంలో అధికారుల వాంగ్మూలాల‌ ఆధారంగా కేసీఆర్‌కు నోటీసులు జారీ చేశారు. కేసీఆర్‌ను ఎప్పుడు, ఎక్కడ విచారిస్తార‌న్న దానిపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>