కలం, వెబ్ డెస్క్: ఏపీ హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి (Chevireddy) భాస్కర్ రెడ్డికి ఊరట లభించింది. లిక్కర్ స్కాం కేసులో భాస్కర్ రెడ్డితోపాటు సజ్జల శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడులకు బెయిల్ మంజూరుచేసింది. మద్యం కేసులో గతేడాది జూన్ 18న అరెస్టైన చెవిరెడ్డి 226 రోజులు జైలు జీవితం గడిపారు. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో గురువారం ఆయన విడుదలయ్యారు.
అనంతరం చెవిరెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు (Chandrababu) సీఎం అయిన ప్రతిసారి నన్ను జైలుకు పంపడం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నా పెద్ద కొడుకుపై 10 కేసులు పెట్టారని, నా చిన్న కొడుకుపై కూడా కేసులు పెట్టారని ఆరోపించారు. ఇక మిగిలింది మా ఆవిడ, మా అమ్మేనని, వాళ్లపై కూడా కేసులు పెడితే సకుటుంబంగా చంద్రబాబు బాధితులమవుతామని చెవిరెడ్డి సెటైర్లు వేశారు.


