epaper
Thursday, January 29, 2026
spot_img
epaper

మహేశ్, సందీప్ వంగా మూవీ ఇప్పట్లో లేనట్లేనా ?

కలం, సినిమా : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో “వారణాసి” (Varanasi) అనే బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీలో నటిస్తున్నాడు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో పృద్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ గతంలోనే ప్రకటించారు. అయితే మహేశ్, సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్‌లో ఓ బిగ్గెస్ట్ మూవీ రానుందని గతంలో న్యూస్ వైరల్ అయింది.

ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా ప్రభాస్‌తో “స్పిరిట్” అనే బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. వచ్చే ఏడాది మార్చి 5 న ఆ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఆ తరువాత మహేశ్ తో సందీప్ సినిమా చేస్తాడా అనుకుంటే.. స్పిరిట్ సినిమా ముగిసిన వెంటనే సందీప్ ‘యానిమల్ పార్క్’ చేస్తున్నట్లు ఇటీవల రణ్‌బీర్ కపూర్ క్లారిటీ ఇచ్చారు. ఆ వెంటనే అల్లుఅర్జున్ తో ఓ మూవీ చేస్తున్నట్లు ఇటీవల న్యూస్ వైరల్ అయింది దీనితో మహేశ్ (Mahesh Babu), సందీప్ కాంబినేషన్‌లో మూవీ ఇప్పట్లో ఉండే సూచనలు కనిపించడం లేదని తెలుస్తుంది.

Read Also: సింగర్ అర్జిత్ సింగ్‌కు ఎన్ని కోట్ల ఆస్తులున్నాయో తెలుసా?

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>