కలం, వెబ్ డెస్క్: ఎముకలు కొరికే చలిలో కూడా ఓ పెంపుడు కుక్క తన యజమానిని విడిచిపెట్టకుండా విశ్వాసం ప్రదర్శించింది. హిమాచల్ ప్రదేశ్‌లోని (Himachal Pradesh) మారుమూల చంబా జిల్లాలో నిరంతర హిమపాతం కురుస్తుంటుంది. ఈ క్రమంలో ఇటీవల పియూష్ కుమార్ (13), విక్షిత్ రాణా (19) ఇద్దరు యువకులు మంచు ప్రాంతాలను చూసేందుకు వెళ్లారు. వీడియో షూట్ కోసం వెళుతుండగా మంచు తుఫాను బారిన పడ్డారు.
కొండపైకి ట్రెక్కింగ్ చేయడానికి ప్రయత్నించారు. కానీ భారీ హిమపాతం కారణంగా మంచులో కూరుకుపోయారు. ఈ యువకుల కోసం రెస్క్యూ బృందాలు గాలించగా పియూష్ కుమార్ అనే యువకుడు చనిపోయి కనిపించాడు. అయితే తన యజమాని డెడ్ బాడీకి పెంపుడు కుక్క (Dog) కాపలా ఉండటం గమనించాయి. తీవ్ర చలిలోనూ తిండి లేకపోయినా యజమానిని విడిచిపెట్టలేదు. అలా నాలుగు రోజులు చలిలోనే గడిపింది కుక్క.

సంఘటనా స్థలాన్ని సందర్శించిన స్థానికులు కుక్కకు ఆహారం పెట్టడానికి ప్రయత్నించారు. అయినా తినలేదు. కుక్క తన యజమానిని విడిచిపెట్టడానికి నిరాకరించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అవుతున్నాయి. కుక్క చూపిన విశ్వాసానికి ప్రతిఒక్కరూ అభినందిస్తున్నారు.
విశ్వాసానికి నిలువెత్తు రూపం: మంచులో గడ్డకట్టిన యజమాని మృతదేహం.. 4 రోజుల పాటు తిండి లేకుండా కాపలా కాసిన DOG !
Heartbreak in Himachal: Two Cousins Perish on Chamba Trek; Faithful Pet Dog Found Guarding Bodies After 4-Day Search#ChambaTragedy #HimachalPradesh #DogLoyalty… pic.twitter.com/9d7a4aM1gm— Kalam Daily (@kalamtelugu) January 27, 2026
Read Also: పాకిస్థాన్లో తిరిగి తెరుచుకున్న లవుని ఆలయం
Follow Us On: Instagram


