కలం, ఖమ్మం బ్యూరో : మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అంతా ఉమ్మడి కుటుంబంలా భావించి ప్రజా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Bhatti) అన్నారు. మంగళవారం మధిర (Madhira) లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల కాలంలో పట్టణ ప్రాంతాల్లో రకరకాల ప్రణాళికలతో పేద, మధ్యతరగతి వర్గాల అభివృద్ధికి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.
2047 విజన్ డాక్యుమెంట్ ప్రకారం 3 ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధించడమే లక్ష్యంగా ప్రపంచంతో పోటీ పడేందుకు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు మెప్మా ద్వారా మున్సిపాలిటీల్లో మహిళలకు 6000 కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో నగరాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున పెరుగుతుండటంతో క్యూర్, ప్యూర్, రేర్ పాలసీని రూపొందించాము.
హైదరాబాద్ బయట మున్సిపాలిటీలను అనేక క్లస్టర్లుగా విభజన చేసి అభివృద్ధి ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. అందులో భాగంగానే రేర్ (రూరల్ అగ్రి రీజనల్ ఎకానమీ) ద్వారా వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు నెలకొల్పి మున్సిపాలిటీల సమీపంలోని గ్రామాల్లో ఉపాధి, ఆదాయం పొందేలా చేయడమే ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామాల్లో ఉత్పత్తులకు మున్సిపాలిటీల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవసాయ ఉత్పత్తుల విలువను పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని భట్టి (Deputy CM Bhatti) స్పష్టం చేశారు.
Read Also: రిజిస్ట్రేషన్ ఆఫీస్ తరలింపుపై వివాదం.. సంగారెడ్డిలో టెన్షన్ టెన్షన్
Follow Us On: Sharechat


