కలం, వెబ్ డెస్క్: టెలిఫోన్ ట్యాపింగ్ విచారణ నేపథ్యంలో చర్చలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రతినిధి వెంకటకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు (Ravinder Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన జీవితంలో ఎన్నడూ వినని మాటను వెంకటకృష్ణ తనను ఉద్దేశించి అన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కేటీఆర్ కు సంబంధించిన టెలిఫోన్ ట్యాపింగ్ విచారణ సమయంలో కొన్ని మీడియా సంస్థలు అనేక అబద్ధాలను ప్రసారం చేశాయని రవీందర్ రావు పేర్కొన్నారు. ఆ ప్రసారాలను చూసి తాను తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యానని తెలిపారు. కేటీఆర్ స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చే వరకు అవి అసత్యాలని తమకు తెలియలేదని పేర్కొన్నారు.
అసత్యాలు ప్రసారం చేస్తున్న తీరుపై తాను స్పందించినందుకు, వెంకటకృష్ణ తాను ఒక శాసనమండలి సభ్యుడిననే గౌరవం కూడా లేకుండా ప్రవర్తించారని రవీందర్ రావు (Ravinder Rao) మండిపడ్డారు. ఇది కేవలం తన వ్యక్తిగత గౌరవానికి సంబంధించిన విషయం మాత్రమే కాదని, శాసనమండలికి, సభ్యులందరికీ జరిగిన అవమానమని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారి పట్ల ఇటువంటి ధోరణి సరైంది కాదని అన్నారు.
Read Also: యాసిడ్ దాడి నిందితుల ఆస్తుల జప్తు.. బాధితులకు పరిహారం: సుప్రీంకోర్టు
Follow Us On: Pinterest


